స్టాఫ్ సెలక్షన్ కమీషన్ 2025 సంవత్సరానికి సంబంధించిన పలు కానిస్టేబుల్ ఉద్యోగాల పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 737 ఖాళీల దిల్లీ పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్ (పురుష) పరీక్షలు డిసెంబర్ 16, 17 తేదీల్లో; 552 హెడ్ కానిస్టేబుల్ (అసిస్టెంట్ వైర్ లెస్ ఆపరేటర్/ టెలీ ప్రింటర్ ఆపరేటర్) పోస్టుల పరీక్షలు జనవరి 15 నుంచి 22 మధ్య; హెడ్ కానిస్టేబుల్(మినిస్టీరియల్) పోస్టులకు జనవరి 7 నుంచి 12 వరకు; 7,565 దిల్లీ పోలీస్ సర్వీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఖాళీలకు సంబంధించి డిసెంబర్ 18 నుంచి జనవరి 6 వరకు జరగనున్నాయి.
ముఖ్య గమనిక:
అభ్యర్థులు తాజా అప్‌డేట్‌ల కోసం కమిషన్ వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించడమైనది.
