Jobresultlive.com | Telugu Local News App Latest News
Job Related News

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి 2025 హంటర్ 350 విడుదల

– రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్ కొత్త రంగులు

– ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, స్లిప్పర్-అసిస్ట్ క్లచ్, ఫాస్ట్ చార్జింగ్       పోర్టల్ వంటి కొత్త ఫీచర్లు

– మెరుగైన సస్పెన్షన్, పెరిగిన గ్రౌండ్ క్లియరెన్స్

– ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్, తమ పాపులర్ మోడల్ అయిన హంటర్ 350లో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ముంబై, ఢిల్లీలలో నిర్వహించిన ‘హంటర్‌హుడ్’ ఫెస్టివల్ వేదికగా 2025 మోడల్ హంటర్ 350 బైక్‌ను కంపెనీ ఆవిష్కరించింది. ఈ కొత్త మోడల్ ఆకర్షణీయమైన కొత్త రంగులతో పాటు పలు కీలకమైన ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో వస్తోంది. 2025 హంటర్ 350 బైక్ ఇప్పుడు మూడు సరికొత్త రంగుల్లో లభ్యమవుతుంది: రియో వైట్, టోక్యో బ్లాక్, లండన్ రెడ్. పాత మోడల్‌తో పోలిస్తే ఇందులో అనేక మార్పులు చేశారు. ముఖ్యంగా, మెరుగైన రైడింగ్ అనుభూతి కోసం ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ట్రిప్పర్ నావిగేషన్ పాడ్, టైప్-సి USB ఫాస్ట్ ఛార్జింగ్ సౌకర్యం అందించారు. అలాగే, గ్రౌండ్ క్లియరెన్స్‌ను 10mm పెంచారు, వెనుక సస్పెన్షన్‌ను మెరుగుపరిచారు, సీట్ కంఫర్ట్‌ను కూడా పెంచినట్లు కంపెనీ తెలిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ 350cc శ్రేణిలో స్లిప్పర్-అసిస్ట్ క్లచ్‌ కలిగి ఉన్న మొదటి బైక్ ఇదే కావడం విశేషం. ఇంజిన్ విషయంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. పాత మోడల్‌లో ఉన్న 349cc, ఎయిర్/ఆయిల్-కూల్డ్, J-సిరీస్ ఇంజిన్‌నే కొనసాగించారు. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది… 20.2 bhp పవర్ వద్ద 27 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ కొత్త 2025 హంటర్ 350 బైక్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఫ్యాక్టరీ బ్లాక్ ధర రూ. 1,49,900 కాగా, డాపర్ (రియో వైట్, డాపర్ గ్రే) వేరియంట్ ధర రూ. 1,76,750, రెబెల్ (టోక్యో బ్లాక్, లండన్ రెడ్, రెబెల్ బ్లూ) వేరియంట్ ధర రూ. 1,81,750గా (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ చెన్నై) నిర్ణయించారు. ఈ బైక్ బుకింగ్స్ అన్ని అధీకృత రాయల్ ఎన్‌ఫీల్డ్ డీలర్‌షిప్‌లతో పాటు కంపెనీ వెబ్‌సైట్‌లో ప్రారంభమయ్యాయి. డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయని కంపెనీ ప్రకటించింది.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Related posts

Bank of Baroda | బ్యాంక్ ఆఫ్ బరోడా లో సీనియర్ మేనేజర్ పోస్టులు

Jobresultlive.com

SEBI Officer Grade A (Assistant Manager) 2025 నియామక ప్రకటన

Jobresultlive.com

ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) – MTS (జనరల్) పరీక్ష-2025 నోటిఫికేషన్!

Jobresultlive.com

Leave a Comment